వరుసగా రెండోరోజూ నష్టాల్లో సూచీలు!

by Harish |   ( Updated:2021-05-12 05:59:13.0  )
వరుసగా రెండోరోజూ నష్టాల్లో సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను నమోదు చేశాయి. ఉదయం నుంచే నష్టాలతో మొదలైన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. ప్రధానంగా ద్రవ్యోల్బణ ఆందోళన, కీలక వడ్డీరేట్లు, బాండ్ల రాబడుల అంశాల్లో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో అమ్మకాలు పెరగడం, మరోవైపు కరోనా భయాలు మదుపర్లలో ఇంకా కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయని విశ్లేషకులు తెలిపారు. దీంతో మారెక్ట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 471.01 పాయింట్లు కోల్పోయి 48,690 వద్ద ముగియగా, నిఫ్టీ 154.25 పాయింట్ల నష్టంతో 14,690 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అధికంగా 3 శాతం పతనమవగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ రంగాల్లో నీరసించాయి. పీఎస్‌యూ బ్యాంక్ పుంజుకుంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.45 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed