- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనసాగుతున్న మార్కెట్ల రికార్డులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డుల జోరు కొనసాగిస్తున్నాయి. వరుస పది రోజుల ర్యాలీతో మంగళవారం మరోసారి జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. కరోనాను నియంత్రించేందుకు కేంద్రం రెండు వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతివ్వడంతో సోమవారం సెన్సెక్స్ 48 వేల మార్కును దాటింది. ఈ క్రమంలో మంగళవారం మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. అయితే, మిడ్ సెషన్ తర్వాత తిరిగి జోరందుకున్న సూచీలు తిరిగి రికార్డుల ర్యాలీని కొనసాగించాయి.
ముఖ్యంగా ఐటీ, ప్రైవేట్ బ్యాంకుల షేర్ల కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు రికార్డులను కొనసాగించాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 260.98 పాయింట్లు ఎగసి 48,437 వద్ద ముగియగా, నిఫ్టీ 66.60 పాయింట్లు లాభపడి 14,199 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 2 శాతంపైగా పుంజుకోగా, రియల్టీ, మెటల్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్, హెచ్‌సీఎల్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.23 వద్ద ఉంది.