30 వేలు దాటిన సెన్సెక్స్..భారీ లాభాల్లో మార్కెట్లు!

by Harish |
30 వేలు దాటిన సెన్సెక్స్..భారీ లాభాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా కోవిడ్-19 వ్యాప్తి నెమ్మదిస్తుందనే సంకేతాలతో మదుపర్లలో సరికొత్త ఆశలు చిగురించాయి. దీనికి తోడు యూరప్ దేశాల్లో కరోనా మరణాలు తగ్గడం, కేసుల సంఖ్య ఇదివరకటి కంటే తక్కువగా నమోదవడంతో యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వీటి ప్రభావం దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2476.26 పాయింట్ల అత్యధిక లాభంతో 30,067 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 708.40 పాయింట్లు లాభపడి 8,792 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సూచీలన్నీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకు 22.60 శాతంతో అధిక లాభాన్ని చూడగా, యాక్సిస్ బ్యాంక్ 19.41 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 14.44 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 13.82 శాతం, హిందూస్తాన్ యూనిలీవర్ 13.51 శాతం, మారుతీ సుజుకీ 13.51 శాతం, హెచ్‌సీఎల్ 12.42 శాతం, నెస్లే ఇండియా 12.14 శాతం లాభాలను సాధించాయి.

Tags : sensex, nifty, NSE, BSE, stock market

Advertisement

Next Story

Most Viewed