బ్యాంక్ సూచీల ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

by  |
బ్యాంక్ సూచీల ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారం ప్రారంభం నష్టాలను నమోదు చేశాయి. కొవిడ్-19 ప్రభావంతో బ్యాంకింగ్ రంగం అనేక సమస్యలను ఎదుర్కొనగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల స్థూల మొండి బకాయిలు 12.5 శాతానికి పెరుగుతాయనే అంచనాలతో పాటు, ఆర్థిక మందగమన, విదేశీ పరిస్థితులు, మారటోరియం అంశం లాంటి వాటి వల్ల బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు ఉన్నాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

ఈ క్రమంలోనే బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఉదయం నుంచే మార్కెట్లు ఒడిదుకులకు లోనయి, చివరికి నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 194.17 పాయింట్లు కోల్పోయి 37,934 వద్ద ముగియగా, నిఫ్టీ 62.35 పాయింట్లు నష్టపోయి 11,131 వద్ద ముగిసింది. నిఫ్టీలో నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 4 శాతం డీలా పడగా, రియల్టీ, ఫార్మా రంగాలు సైతం ప్రతికూలంగా కదలాడాయి. ఐటీ రంగం మాత్రం లాభాల్లో ట్రేడయింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆల్ట్రా సిమెంట్, టాటాస్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడయ్యాయి.


Next Story

Most Viewed