- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లకు తప్పని నష్టాలు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాలతో కుదేలయ్యాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో స్వల్పంగా లాభాలు సాధించినప్పటికీ మిడ్-సెషన్ నుంచి మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో సూచీలు నష్టాల్లోకి జారాయి. అయితే, చివరి గంటలో బ్యాంకింగ్ రంగం మద్దతుతో భారీ నష్టాలను సూచీలు తప్పుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయంగా గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల వద్ద కదలాడుతుండటంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు సిద్ధపడుతున్నారు.
ముఖ్యంగా కీలక రంగాల్లో కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 101.88 పాయింట్లు కోల్పోయి 60,821 వద్ద, నిఫ్టీ 63.20 పాయింట్ల నష్టంతో 18,114 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐటీసీ, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.86 వద్ద ఉంది.