లాభాల నుంచి నష్టాల్లోకి మార్కెట్లు

by Harish |
లాభాల నుంచి నష్టాల్లోకి మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. భారీ నష్టాల నుంచి తేరుకునేలోపు సూచీలు మళ్లీ నీరసించాయి. గురువారం నాటి ఊగిసలాట ధోరణిని కొనసాగించిన మార్కెట్లు మిడ్‌సెషన్ సమయంలో 200 పాయింట్లకు పైగా దిగజారి చివరి గంటలో కొంత నిలదొక్కుకున్నాయి.

అమెరికా మార్కెట్ల పరిణామాలతో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ బలపడిందని, అయితే, భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 95.09 పాయింట్లు నష్టపోయి 38,990 వద్ద ముగియగా, నిఫ్టీ 7.55 పాయింట్లు కోల్పోయి 11,527 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా ఫార్మా, ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు బలపడగా, మెటల్, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్ (Titan), టెక్‌మహీంద్రా(Tech Mahindra), నెస్లె ఇండియా(Nestle India), మారుతీ సుజుకి(Maruti Suzuki), సన్‌ఫార్మా(sunpharma), ఏషియన్ పెయింట్స్(Asian Paints), టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్(Infosys), హెచ్‌సీఎల్ (HCL), బజాజ్ ఆటో (Bajaj Auto), ఎల్అండ్‌టీ (L&T),షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ (icici bank), భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel), యాక్సిస్ బ్యాంక్(Axis Bank), కోటక్ బ్యాంక్(Kotak Bank), పవర్‌గ్రిడ్ (Powergrid), ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), ఓఎన్‌జీసీ (ONGC), ఎస్‌బీఐ (SBI), బజాజ్ ఫైనాన్స్(Bajaj Finance), ఎన్‌టీపీసీ (NTPC) షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ కొంత బలహీనపడి రూ. 73.47 వద్ద ఉంది.

Advertisement

Next Story