సూచీలపై బ్యాంకింగ్ మోత..నష్టాల్లో మార్కెట్లు!

by Harish |
సూచీలపై బ్యాంకింగ్ మోత..నష్టాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకరోజు సెలవు అనంతరం శుక్రవారం ప్రారంభమైన మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్న్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు ఒత్తిడికి గురవ్వడంతో నష్టాలు తప్పలేదు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై ఎలాంటి సంకేతాలను ఇవ్వకపోవడంతో మదుపర్లలో నిరుత్సాహం అలుముకుంది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కూడా ప్రభావితం చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 674.36 పాయింట్లను కోల్పోయి 27,590 వద్ద క్లోజయింది. నిఫ్టీ 170 పాయింట్లు నష్టపోయి 8,083 వద్ద ముగిసింది.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం, ఫార్మా, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కొంత ఊరటనిచ్చాయి. ప్రముఖ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల ప్రతికూల దృక్పథాన్ని చూపడంతో మదుపర్లు ఆ రంగంలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. సన్‌ఫార్మా, ఐటీసీ, ఓఎన్‌జీసీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ ఏకంగా 48 పైసలు క్షీణించి రూ. 76.08 వద్ద కొనసాగుతోంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed