- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే జోరు.. అదే స్పీడు… లాభాల్లో మార్కెట్లు!
by Harish |
X
అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూల సంకేతాలను ఇస్తుండటంతో దేశీయ మార్కెట్లు అదే జోరులో రెండోరోజు కూడా లాభాలతోనే ముగించాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత ఒక దశలో 400 పాయింట్ల వరకూ ఎగిసిన సూచీలు 349.76 పాయింట్ల లాభంతో 41,565 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 93.30 పాయింట్లు లాభపడి 12,201 వద్ద క్లోజయింది. కాస్త విరామం తర్వాత నిఫ్టీ 12,000 స్థాయిని దాటింది.
ప్రైవేట్ బ్యాంకుల సూచీలు సానుకూలంగా కదలడం మార్కెట్‌కు కలిసొచ్చింది. సెన్సెక్స్‌లో హిందూస్తాన్ యూనిలివర్ అత్యధికంగా 5 శాతం పైగా లాభపడింది. ముఖ్యంగా కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల బాటలో పయనించగా, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీలు నష్టాలను చవిచూశాయి. రూపాయి మారకం విలువ స్వల్పంగా బలహీనపడి రూ. 71.31 గా ఉంది.
Advertisement
Next Story