వారాంతంలో మార్కెట్లకు స్వల్ప నష్టాలు!

by  |
వారాంతంలో మార్కెట్లకు స్వల్ప నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన మార్కెట్లు ఆసియా మార్కెట్ల నష్టాలతో ప్రభావితమయ్యాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో దేశీయ సూచీలపై ప్రభావం కనబడింది. అయితే, మిడ్ సెషన్ సమయంలో కొంత నిలకడగా రాణించిన సూచీలు ఉదయం నష్టాల నుంచి రికవరీ అయినప్పటికీ చివరి గంటలో స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 11.57 పాయింట్ల నష్టంతో 38,128 వద్ద ముగియగా, నిఫ్టీ 21.30 పాయింట్లు కోల్పోయి 11,194 వద్ద ముగిసింది. అమెరికా, ఆసియా మార్కెట్ల బలహీనతతో ఉదయం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపించారని, అందుకే మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాలను నమోదు చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నిఫ్టీలో ఐటీ రంగం మాత్రమే ఒక శాతానికిపైగా లాభపడగా, రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, మీడియా, ఫార్మా రంగాలు ఒక శాతనికిపైగా నష్టాల్లో ట్రేడాయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్, రిలయన్స్, టెక్‌మాహీంద్రా, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ షేర్లు అధిక లాభాలను నమోదు చేయగా, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, టాటాస్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి..


Next Story

Most Viewed