- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలను చూసిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ముఖ్యంగా గత వారాంతం త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆదాయ వెల్లడిపై ఇన్వెస్టర్లు ప్రతికూలంగా స్పందించారు. బ్యాడ్ లోన్స్‌పై కేటాయింపులు ఊహించిన దానికంటే తక్కువగా వెల్లడించడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, దేశీయ ఫైనాన్స్, బ్యాంకింగ్, మెటల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.
అంతేకాకుండా ఆసియా ప్రాంతాల్లో కరోనా మహమ్మారి కేసులు అనూహ్యంగా పెరగడంతో ఆర్థికవ్యవస్థ కోలుకోవడంపై మదుపర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 586.66 పాయింట్లను కోల్పోయి 52,553 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 171 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ అధికంగా 2 శాతం పతనమవగా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీప్సీ, నెస్లె ఇండియా, డా రెడ్డీస్, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.98 వద్ద ఉంది.