- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మకాల ఒత్తిడితో డీలా పడిన సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు గరిష్ఠ స్థాయిల వద్ద ముగిసిన తర్వాత గురువారం సూచీలు డీలాపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో 53 వేల మార్క్ సాధించిన సెన్సెక్స్ తిరిగి దిగువకు పడిపోయింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్ 485.82 పాయింట్లు కోల్పోయి 52,568 వద్ద ముగియగా, నిఫ్టీ 151.75 పాయింట్ల నష్టంతో 15,727 వద్ద ముగిసింది.
నిఫ్టీలో మెటల్ అధికంగా 2 శాతం కుదేలవగా, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫైనాన్స్, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్ షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన అన్ని షేర్లు పడిపోయాయి. ముఖ్యంగా టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, డా రెడ్డీస్, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా దాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.82 వద్ద ముగిసింది.