రెండ్రోజుల నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు!

by  |
రెండ్రోజుల నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు!
X

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు రెండు రోజుల నష్టాల నుంచి ఊరట లభించింది. జూలై నెల డెరివేటివ్ సిరీస్ శుభారంభంతో పుంజుకున్న సూచీలు వారాంతానికి లాభాలను నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లు జోరును కొనసాగించడంతో చివరి గంటలో మరింత లాభాల్లో ట్రేడయ్యాయి. ప్రధానంగా ఐటీ రంగం షేర్ల మద్దతుతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ రంగాల సూచీలుయ లాభాల్లో ట్రేడయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 329.17 పాయింట్ల లాభంతో 35,171 వద్ద ముగియగా, నిఫ్టీ 94.10 పాయింట్లు లాభపడి 10,383 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండస్ఇండ్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్, ఎల్అండ్‌టీ, ఆల్ట్రాటెక్, బజాజ్ ఆటో, రిలయన్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను నమోదు చేయగా, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, ఎంఅండ్ఎం సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.66 వద్ద కొనసాగుతున్నది.


Next Story

Most Viewed