- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎమ్మెల్యే మాటల్లో అంతర్యమేంటి..?
దిశ, ఖమ్మం ప్రతినిధి: తమ నియోజకవర్గంలో పోడు సమస్య తీర్చాలన్న రేగా కాంతారావు విన్నపానికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. కానీ, సమస్య పరిష్కారం దిశగా కదలలేదు. ఈ నేపథ్యంలోనే కాంతారావు మంగళవారం ఓ మీడియా సంస్థతో హైదరాబాద్ లో మాట్లాడుతూ.. సీఎం కీసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తానంటేనే టీఆర్ఎస్‌లో చేరానంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. సీఎం తమకు హామీ ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు బతకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు ఉద్యమంలో భాగంగా తమ కార్యాచరణపై వెనక్కిపోం అని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. ఫారెస్ట్ భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే ఆదివాసీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
పోడు చేసుకుంటున్న గిరిజనులపై ఎవ్వరూ దాడులు చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు వినడం లేదు. ఈ పరిస్థితే ఇప్పుడు స్థానికం ప్రజాప్రతినిధులకు, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇదే పోడు సమస్య గిరిజనులు ఎక్కువగా ఉండే పినపాక నియోజకవర్గాన్ని కుదిపేస్తుంది. ఆ ప్రాంత ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వాలని ఎప్పటినుంచే డిమాండ్ ఉంది. పోడు సమస్యకు వ్యతిరేకంగా పోరాడినందుకే అప్పుడు కాంగ్రెస్ తరఫున పినపాక నుంచి రేగా కాంతారావు గెలిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలనే ప్రధాన కండీషన్‌తో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. రేగా ఒత్తిడి మేరకు గత మార్చిలోనే పోడు చేసుకునే గిరిజనులకు పట్టాలు అందించేందుకు సీఎం పర్యటన సైతం ఖరారైనా, కొవిడ్ నేపథ్యంలో నిలిచిపోయింది. అప్పటి నుంచి పట్టాలు ఇవ్వకపోవడంతో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు, కేసుల నమోదు పెరిగిపోయాయి.
నియోజకవర్గ అభివృద్ధికి సైతం మొండి చేయి..
ఎన్నికల్లో గెలిచిన దగ్గరనుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి నిధులూ మంజూరు కాలేదు. బీటీపీఎస్, సీతారామా ప్రాజెక్టుకు సంబంధించి కొంతమంది నిర్వాసితులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. దీంతో గతంలో వారు ఆందోళన బాట పట్టారు. కాగా, రేగా చేసినట్లుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు ప్రచారం కావడంతో నియోజకవర్గంతో పాటు జిల్లాలో పెద్ద చర్చ నడుస్తోంది. అధిష్ఠానానికి విధేయతగా ఉండే కాంతారావు ఇలా మాట్లాడడానికి కారణాలేమై ఉంటాయని విశ్లేషించుకుంటున్నారు.