- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ ఎన్నికలపై సీమాంధ్రుల సర్వే.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశప్రతినిధి, కరీంనగర్ : ఉద్యమ సమయంలో జరిగిన ఉపఎన్నికల కన్నా హీట్ పుట్టిస్తున్నాయి హుజురాబాద్ బై పోల్స్. కేవలం తెలంగాణాలోనే కాకుండా సీమాంధ్రలో కూడా ఉపఎన్నికలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఎవరు గెలువబోతున్నారని అక్కడ బెట్టింగులు నడుస్తుంటే ఇక్కడ కొన్ని టీమ్స్ సర్వేలు చేస్తున్నాయి. దీంతో హుజురాబాద్ ఉపఎన్నికలు కేవలం తెలంగాణకే కాకుండా సీమాంధ్ర ప్రాంతానికి కూడా ప్రత్యేకంగా మారాయని స్పష్టం అవుతోంది.
సర్వే టీమ్స్..
హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలోని పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సర్వే టీమ్స్ ప్రత్యేకంగా తిరుగుతున్నాయి. జమ్మికుంట, హుజురాబాద్‌లలో క్యాంపులు ఏర్పాటు చేసుకున్న ఈ టీమ్స్ సునిశితంగా ఆరా తీస్తున్నాయి. రోజురోజుకూ మారుతున్న సమీకరణాలపై క్షేత్ర స్థాయిలో కూపీ లాగుతున్నాయి. హుజురాబాద్ ఓటరు నాడిని పసిగట్టేందుకు ఈ టీమ్స్ విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థికి ప్రజల్లో ఉన్న సానుకూలత ఎలా ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఎంత మేర అనుకూలత ఉంది అన్న వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం, మంత్రులు, ఇతర ముఖ్య నాయకుల ప్రచారం ప్రభావం ఎంత మేర చూపనుంది. ప్రజల్లో వస్తున్న సానుకూలత ఎంత అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకుల ప్రచారం తరువాత నియోజకవర్గంలో సమీకరణాలు మారాయా? ఈటలకు బలం పెరిగిందా తగ్గిందా? అనే విషయంపై కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.
గెలుపు ఈటలదా.. కేసీఆర్‌దా..?
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉన్నదని భావిస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికలపై సీమాంధ్ర రాజకీయ వర్గాల్లో తీవ్రఉత్కంఠ నెలకొన్నట్టు తెలుస్తోంది. అక్కడి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తాడా..? లేక సీఎం కేసీఆర్ సక్సెస్ అవుతారా..? అన్న విషయంపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన వారితో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఈ ఎన్నికలు ఈటల వర్సెస్ కేసీఆర్ మధ్య సాగుతున్నాయన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. ఈటల గెలుస్తాడని కొందరు, కేసీఆర్ గెలుస్తాడని మరికొందరు బెట్టింగులు కూడా పెట్టుకుంటున్నారని సమాచారం. లక్షల్లో జరుగుతున్న ఈ బెట్టింగుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోందని తెలిసింది. రోజుకు రెండు, మూడు సార్లు హుజురాబాద్ ప్రాంత వాసులకు ఫోన్లు చేస్తూ వివరాలు తెలుసుకుని బెట్టింగ్ డిపాజిట్లను పెంచుకుంటూ పోతున్నారని సమాచారం. హుజురాబాద్ ఉపఎన్నికలు కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, సీమాంధ్ర ప్రాంత వాసులకు కూడా తీవ్ర ఉత్కంఠను రేపుతుండటం విశేషం.
వందల కోట్లలోనే..
హుజురాబాద్ బై పోల్స్‌లో గెలిచే అభ్యర్థులపై బెట్టింగులు వందల కోట్లలోనే జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో పాటు ఏపీలో పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నట్టు సమాచారం. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు కూడా బెట్టింగులు వేస్తున్నట్టు తెలిసింది. రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు ఒక్కో బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో పాల్గొన్న వ్యక్తి అతను చెప్పిన అభ్యర్థి గెలిస్తే పది రెట్లకు పైగా అధికంగా డబ్బులు ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.
క్రికెట్ మ్యాచ్‌లకు మించి..
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్‌ల పైనే పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతుంటాయి. నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నప్పుడు కూడా బాల్ టు బాల్, సిక్స్, ఫోర్‌కు, వికెట్‌కు ఎలా అయితే బెట్టింగ్లు సాగుతాయో.. హుజురాబాద్ బై పోల్స్‌లోనూ అంతే సాగుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న విషయంతో పాటు, మెజార్టీ ఎంత వస్తుంది, వందల్లో మెజార్టీ అయితే ఇంత, వేలల్లో అయితే ఇంత, అభ్యర్థికి మొత్తం వచ్చే ఓట్ల శాతం ఎంత.. అన్న విషయాలపై కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ప్రభావంతో పడే ఓట్లు ఎన్ని, ఈటల రాజేందర్ ఇమేజ్‌తో పడే ఓట్లు ఎన్ని.. అన్న విషయాలపైనా బెట్టింగుల దందా సాగుతోందని తెలిసింది.