- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘సెల్మాన్ భోయ్’ గేమ్
దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు కృష్ణజింకల కేసులో శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇన్సిండెంట్‌కు సంబంధించిన ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకుని వచ్చిన ‘సెల్మాన్ భోయ్’ అనే గేమ్ యువతలో పాపులర్ అయింది. ఇంతకీ ఈ గేమ్‌లో సెల్మాన్ ఏం చేస్తాడు? జింకలను వేటాడుతాడా? ఇంకేమైనా చేస్తాడా?
సెల్మాన్ భోయ్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండగా, దీన్ని పుణేకు చెందిన పేరడి స్టూడియోస్ రూపొందించింది. ‘ఈ గేమ్ కాల్పనిక ఘటనలతో చిత్రీకరించాం’ అనే డిస్‌క్లెయిమర్‌తో ఈ గేమ్ ప్రారంభమవుతుంది. అంతేకాదు ‘మమ్మల్ని తప్పుగా భావించవద్దు, ఈ గేమ్‌లో సెల్మన్ భోయ్ హీరో కాగా, ఇందులో అతడు ఎవరికీ చెడు చేయడు. గ్రహాంతరవాసులను చంపుతుంటాడు’ అని మేకర్స్ వివరించారు. ఈ గేమ్ ప్రారంభంలో ‘సెల్మన్ భోయ్’ అనే ఆటగాడు ‘ఐష్’ అనే ఆల్కహాల్ సేవించి, అర్ధరాత్రి డ్రైవింగ్ చేయడం చూడవచ్చు.
ఆటలో 3 స్థాయిలున్నాయి:
గ్రీన్ లెవల్: ఈ స్థాయిలో సెల్మన్ భోయ్ తన కారును ఒక వింత గ్రహం నుంచి నడపాలి. ఈ క్రమంలో అక్కడి పార్కులో ఉన్న జింకలు, గ్రహాంతరవాసులను వెంబడిస్తూ, ఏలియన్స్ చంపాలి.
ఐస్ లెవల్ : ఇది మంచులో సాగుతుంది. ఆటలోని గ్రహం అంటార్కిటికా లాగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో గ్రహాంతరవాసులు, ధ్రువ ఎలుగుబంట్లు, పెంగ్విన్‌లు తిరుగుతాయి. ఆటగాడు ధ్రువ ఎలుగుబంట్లతో పాటు గ్రహాంతరవాసులను చంపాలి.
ఎడారి స్థాయి: తేలు, ఒంటెలుండే ఎడారిలో సెల్మోన తన కారును నడుపుతూ, ఎడారి భూమిలో కనిపించే అన్ని జీవుల మీదుగా ఆటగాడు పరిగెత్తాల్సి ఉంటుంది.
లెవల్స్ దాటే కొద్దీ, కొత్త కార్లకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశముంటుంది. లీడర్‌బోర్డ్‌లో టాప్ పొజిషన్‌లో ఉండే అవకాశాలను పెంచుకోవచ్చు. గేమ్‌లో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఆటగాడు అన్ని గ్రహాంతరవాసులను చంపాలి. సెల్మోన్ భోయ్ అనే గేమ్ యువతను ఆకట్టుకుంటుండగా, ఇది ఇప్పటికే పదివేలకుపైగా డౌన్‌లోడ్స్ సాధించింది.
- Tags
- aliens