కుటుంబ పోషణ భారంతో శిశువు విక్రయం

by Anukaran |   ( Updated:2020-10-29 02:04:15.0  )
కుటుంబ పోషణ భారంతో శిశువు విక్రయం
X

దిశ, వెబ్‎డెస్క్ :
కుటుంబ పోషణ భారంగా మారడంతో తన శిశువును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మోర్తాడ్‎లో ఓ మహిళ తన బిడ్డను రూ.15 వేలకు అమ్మకానికి పెట్టింది. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో బిడ్డను అమ్ముతున్నట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed