- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు బీసీసీఐ, సెలెక్టర్ల కీలక భేటి
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ ముందు బీసీసీఐ, చీఫ్ సెలెక్షన్ కమిటీ శనివారం కీలక భేటీ నిర్వహించనున్నది. వరల్డ్ కప్ కోసం గతంలో 15 మంది ఆటగాళ్లతో పాటు మరో ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే వారిలో చాలా మంది ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన చేయడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళనలో పడింది. కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రి నుంచి వచ్చిన సూచనల మేరకు ఇప్పటికే ఎంపిక చేసిన వారిలో కొంత మందిపై వేటు వేసి కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తున్నది.
హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్‌లపై దృష్టిపెట్టనున్నారు. వీరిద్దరితో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్‌ల ఫామ్ ఆందోళనకు గురి చేస్తున్నది. వీరి స్థానంలో శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్‌లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించేందుకు గత నెలలోనే గడువు తీరిపోయింది. దీంతో బీసీసీఐ ఏ విధంగా ఈ మార్పులు చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.