శేఖర్ కమ్ములకు పితృవియోగం

దిశ, సనత్ నగర్: ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి శేషయ్య కమ్ముల (90) శనివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో DIG‌గా పనిచేసి శేషయ్య రిటైర్ అయ్యారు. అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. శేషయ్యకు నలుగురు సంతానం కాగా అందులో శేఖర్ కమ్ముల చివరివాడు. శేషయ్య అంత్యక్రియలు శనివారం సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్‌లోని హిందూ స్మశానవాటికలో నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ నిబంధనల మేరకు కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.

Advertisement