- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా నిషేధిత సిగరెట్లు పట్టివేత
దిశ, క్రైమ్ బ్యూరో : నగరంలో నిషేదిత సిగరెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని నుంచి రూ.16 లక్షల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన నిషేధిత సిగరెట్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ బి.గట్టుమల్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
ఢిల్లీ నగరానికి చెందిన సందీప్ సింగ్ బావేజా (36) చదువు పూర్తి కాగానే పలు ట్రాన్స్ పోర్టు కంపెనీలలో పనిచేశాడు. అనంతరం హైదరాబాద్ నగరానికొచ్చిన సందీప్ సింగ్ 2019లో జుమేరాత్ బజార్ లో ‘నాగపూర్ భోపాల్’పేరుతో ట్రాన్స్ పోర్టు వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, కుటుంబానికి, వ్యక్తిగత విలాసాలకు ఖర్చులు సరిపోనందున నిషేధిత సిగరెట్లను విక్రయించి, అధిక లాభాలు పొందాలని భావించాడు.
దీంతో ఢిల్లీలో గతంలో ట్రాన్స్ పోర్టు లలో పనిచేసిన వారి ద్వారా సంబంధాలు కొనసాగిస్తూ.. ఢిల్లీలో తక్కువ ధరకు సిగరెట్లను కొనుగోలు చేస్తూ, హైదరాబాద్ లో అధిక రేట్లకు విక్రయించేందుకు ప్రణాళిక వేశాడు. సిగరెట్ డబ్బాలపై హెచ్చరిక చిత్రం లేనటువంటి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన కస్టమ్స్ ట్యాక్స్, జీఎస్టీని ఎగవేస్తూ విన్, బ్లాక్, టోటల్, కింగ్స్ గోల్డ్ ప్లాక్, గోల్డ్ పాలమ్ అండ్ గోల్డ్ విమల్ తదితర సిగరెట్లను హైదరాబాద్ కు దిగుమతి చేసుకుంటున్నాడు.
నగరంలోని అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. వీటిని జుమేరాత్ బజార్ లో ప్రత్యేకంగా ఓ గది అద్దెకు తీసుకుని గోడౌన్ భద్రపర్చేవాడు. ఢిల్లీలో రూ.20 లకే విక్రయించే సిగరెట్ ప్యాకెట్ ను హైదరాబాద్ లో రూ.40 లకు విక్రయిస్తూ లాభాలు అర్జిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం సందీప్ సింగ్ గోడౌన్ వద్ద ఉండగా.. పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూ.16 లక్షల విలువైన వివిధ బ్రాండ్ల సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం షాహినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న ఇన్ స్పెక్టర్ గట్టు మల్లు, వెస్ట్ జోన్ ఎస్ఐలు పి.మల్లిఖార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ, రంజిత్ కుమార్ లను డీసీపీ రాధాకిషన్ రావు అభినంధించారు.