సెహ్వాగ్ తిక్క.. పవన్ లెక్క.. వైరల్‌ వీడియో..

by Shyam |   ( Updated:2021-09-07 07:11:59.0  )
pavan
X

దిశ, సినిమా : తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనియా ఎలా ఉంటుందో తెలియంది కాదు. ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ అనే కాదు సెలబ్రిటీస్‌లోనూ ఆయనకున్న క్రేజ్ వేరు. ఇక పవన్ బర్త్‌డే వచ్చిందంటే పవనిజం నామస్మరణతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఫిలిం స్టార్‌గానే కాక, పొలిటీషియన్‌గా, యువతకు రోల్ మోడల్‌గా నేటితరంలో ఆయన స్టార్‌డమ్‌ను అందుకోవడం ఎవరివల్ల కాదేమో. ఇక ఇటీవల జరిగిన పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ మూడ్ నుంచి జనసైనికులు ఇంకా బయటికి రాకముందే.. జనసేనాని స్టార్‌డమ్ వారికి మరోసారి సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం కల్పించింది. భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. పవన్ పాపులర్ డైలాగ్‌ను పలికిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://twitter.com/RusthumHere/status/1434920192488853506?s=20

వీరేంద్ర సెహ్వాగ్‌ తన ఇంటర్వ్యూలో ‘గబ్బర్ సింగ్’ మూవీ నుంచి పవన్ ఫేమస్ డైలాగ్ ‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ డైలాగ్‌ను పలికిన వీడియో క్లిప్ పవన్ ఫ్యాన్స్‌ను కిక్కిస్తోంది. అంతేకాదు ఈ క్లిప్పింగ్‌లో జనసేనాని మ్యానరిజం(మెడపై చేయి పెట్టుకోవడం)ను కూడా వీరు భాయ్ పక్కాగా ఫాలో అయ్యాడు. దీంతో తమ ఫేవరెట్ క్రికెటర్ సెహ్వాగ్.. తమ అభిమాన హీరోను ఇమిటేట్ చేయడంపై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story