వారి కోసం ‘సీతక్క ఫౌండేషన్ స్కూళ్లు’

by Shyam |
వారి కోసం ‘సీతక్క ఫౌండేషన్ స్కూళ్లు’
X

దిశ, వెబ్‌డెస్క్ :

ములుగు ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. లాక్‌డౌన్ సమయంలో గిరిజనుల ఆకలి తీర్చేందుకు ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే వరంగల్‌లో వరదలు వచ్చిన సమయంలోనూ నీళ్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, వారికి ఆశ్రయం కల్పించడంలో తన వంతు పాత్ర పోషించింది.

ప్రస్తుతం సీతక్క గిరిజనుల అభివృద్ధికి మరో సేవా కార్యక్రమం చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. గిరిజన పిల్లల కోసం పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వారికి చదువుకోవాలనే కోరిక ఉన్నా అడవిని విడిచి బయటకు రాలేరు. అందుకోసమనే త్వరలో ‘సీతక్క ఫౌండేషన్ స్కూళ్లు’ ప్రారంభించనున్నట్లు తెలిపారు.కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే వీటి నిర్వహణ ఉంటుందని ఆమె వివరించారు. గిరిజన బిడ్డలు భావి భారతానికి భవిష్యత్ అవుతారని తనకు నమ్మకముందని ములుగు ఎమ్మెల్యే ఆశా భావం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story