గురుకులాల్లో చేరాలనుకుంటే.. వెంటనే అప్లై చేసుకోండి!

by Shyam |
RS Praveen Kumar ips
X

దిశ, నాగర్ కర్నూల్: 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం 4 నుండి 5వ తరగతిలో అడుగిడే విద్యార్థులు గురుకుల పాఠశాలల ప్రవేశం కోసం తక్షణమే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్య సంవత్సరానికి షెడ్యుల్ తెగలు, షెడ్యుల్ కులాలు, వెనుకబడిన తెగలు, జనరల్ కేటగిరీలలో ఉన్న అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో చేరేందుకు కామన్ ప్రవేశ పరీక్షా నిర్వహణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోడానికి Tgcet.cgg.gov.in లో లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 చివరి తేదీ అని గుర్తుచేశారు. కావున విద్యార్థులు, వెంటనే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed