- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువే.. గణాంకాలు విడుదల చేసిన ప్రభుత్వం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని, ఈ నెల చివరికల్లా దాదాపుగా నియంత్రణలోకి వస్తుందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్, ఇంటింటి ఫీవర్ సర్వే మంచి ఫలితాలను ఇస్తున్నాయని వివరించారు. మరో రెండు వారాల్లో కరోనా వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల బృందాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఫీవర్ సర్వే చేపట్టామని, రాష్ట్రం మొత్తం మీద 1.88 లక్షల మందికి జ్వరం, జలుబు లాంటి లక్షణాలున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ముందుగానే కోవిడ్ మెడికల్ కిట్లను అందించామన్నారు.
లక్షణాలు ఉన్నవారు భయపడిపోయి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోడానికి టెస్టింగ్ సెంటర్లకు భారీ స్థాయిల వెళ్తున్నారని, పరిమిత స్థాయిలో వైద్య సిబ్బంది ఉన్నందువల్ల ఎక్కువ సేపు క్యూలో నిల్చోవాల్సి వస్తోందని, సోషల్ డిస్టెన్స్ లాంటి నిబంధనలను పాటించకపోవడం వలన అక్కడే వైరస్ వ్యాప్తికి ఎక్కువ ప్రమాదం వస్తున్నట్లు గుర్తించామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నా సెకండ్ వేవ్ తీవ్రతలో ఎక్కువ మంది ఒకేసారి టెస్టింగ్ కేంద్రాల దగ్గరకు వస్తుండడంతో ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటోందని, దీన్ని నివారించడం కోసమే వారి ఇళ్ళ దగ్గరికే వైద్య బృందాలు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యారోగ్య సిబ్బంది, స్థానిక సంస్థల్లోని వివిధ విభాగాల సిబ్బందితో టీమ్‌లను ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్ళి జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలను అడిగి తెలుసుకుని దానికి తగిన మందులను ఇస్తున్నామని, ఐదారు రోజుల పాటు వాడిన తర్వాత తగ్గకపోతే అప్పుడు టెస్టులు చేయించుకునే విధానాన్ని అమలుచేస్తున్నామని, ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్నే అమలు చేయాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇప్పటి దాకా సుమారు 80 లక్షల కుటుంబాలను ఈ బృందాలు కలిశాయని, ఇందులో 1.88 లక్షల మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని, వారికి మందులు ఇవ్వడంతో పాటు ఎక్కువ లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.
త్వరలో 18-44 వయస్కులకు టీకాలు ..
కేంద్ర ప్రభుత్వం మొదటి, రెండవ దశల్లో టీకాల కార్యక్రమం కోసం 45 ఏళ్ళ వయసు పైబడినవారికి ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వడానికి రాష్ట్రానికి ఇప్పటిదాకా 57.30 లక్షల డోసులను అందించిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ‘టీకా ఉత్సవ్‘ థర్డ్ ఫేజ్‌లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏజ్ గ్రూపువారికి కూడా టీకాలు ఇవ్వాల్సి ఉందని, కానీ కేంద్రం నుంచి తగిన సంఖ్యలో రాకపోవడంతో ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. ఈ అవసరం కోసం వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4.90 లక్షల డోసులను కొనుగోలు చేసిందని, కానీ ఇది రెండు రోజులకు మాత్రమే సరిపోతున్నందున తగిన సంఖ్యలో సమకూరేంత వరకు మొదలుపెట్టవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లను సమకూర్చుకోనున్నందున త్వరలోనే 18-44 ఏజ్ గ్రూపువారికి కూడా టీకాల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రం..
గతేడాదిలోని మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఇది అదే తీరులో ఉంది. అందువల్లనే ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మృతి చెందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. తొలి వేల్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరం పెరిగింది. దీని వెన్నంటే రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్ల అవసరం కూడా పెరిగింది. టెస్టింగ్ కిట్ల కొరతతో రాష్ట్రంలో తక్కువ సంఖ్యలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. పాజిటివ్ బారిన పడినవారిలో గతేడాదికంటే ఈసారి ఎక్కువ మంది ఆస్పత్రులపాలు కావాల్సి వచ్చింది. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. గతేడాది వారం రోజుల పాటు క్వారంటైన్ లేదా ఐసొలేషన్‌లో ఉంటే సరిపోయేది. లేదా ఆస్పత్రుల్లో చేరిన తర్వాత వారం పది రోజుల్లోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉండింది. కానీ ఈసారి మాత్రం ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకడమే గగనంగా మారింది.
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే సెకండ్ వేవ్‌లో పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.
వివరాలు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్
పాజిటివ్‌లు 3,00,933 2,37,843
ఆస్పత్రుల్లో అడ్మిషన్లు 48,110 48,110
అడ్మిట్ శాతం (8.2%) (20.22%)
రికవరీ 2,95,387 1,90,257
రికవరీ శాతం (90.47%) (79,99%)
టెస్టులు 87,21,026 54,74,906
ప్రతీ 10 లక్షల మందికి చేసిన టెస్టులు 3,81,406 1,47,095
పాజిటివిటీ రేటు 3.78% 4.32%
మరణాలు 1,634 1,378
డెత్ రేటు (0.56%) (0.57).