ఆ ఐదు పార్టీలకు కామన్ సింబల్స్

by Shyam |
ఆ ఐదు పార్టీలకు కామన్ సింబల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో ఐదు రాజకీయ పార్టీలకు కామన్​ సింబల్స్​ (ఒకే రకమైన గుర్తు)ను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. హిందూస్థాన్ జనతాపార్టీకి కొబ్బరి తోట, ఇండియా ప్రజాబంధు పార్టీకి ట్రంఫెట్, జనసేన పార్టీకి గాజు గ్లాస్, మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పార్టీకి గ్యాస్ సిలిండర్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఈల గుర్తును కేటాయించినట్లు ఎస్​ఈసీ ప్రకటించింది. ఈ పార్టీలకు కేటాయించిన గుర్తులు ఐదు సంవత్సరాల పాటు మనుగడలో ఉంటాయని, జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఐదు ఏండ్లలో ఏదేని స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల్లో పది శాతం సీట్లలో పోటీ చేయకుంటే కేటాయించిన గుర్తులు రద్దు చేస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. కేటాయించిన గుర్తులు సదరు పార్టీ తరపున పోటీచేసే స్థానాల వరకే పరిమితంగా ఉంటాయని, పోటీ చేయని స్థానాలలో ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed