- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్ఐసీ ఐపీవోకు తొలగిన అడ్డంకి!
దిశ, వెబ్‌డెస్క్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) దిగ్గజ కంపెనీల లిస్టింగ్‌కు సంబంధించి నిబంధనలను సడలించింది. దీనివల్ల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీవో మార్గం సుగుమం అయింది. పెద్ద కంపెనీలు ఐపీవోకు వచ్చేందుకు ఇప్పుడు 10 శాతానికి బదులుగా కనీసం 5 శాతం కేటాయించవచ్చని రెగ్యులేటరీ తెలిపింది. అంతేకాకుండా, మూడేళ్లకు బదులు ఐదేళ్లలో 25 శాతం వాటాను ప్రజలకు కేటాయించే వీలుంటుందని సెబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిబంధనల మార్పుతో భారీ కంపెనీలకు మార్కెట్ లిస్టింగ్ విషయంలో ఇబ్బందులు తప్పనున్నాయి. ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కంపెనీ పరిమాణం అడ్డంకిగా మారింది. ఎందుకంటే పాత నిబంధనల ప్రకారం మార్కెట్లోకి వస్తే రూ. లక్ష కోట్లకు మించి అవసరమవుతుంది. ఈ మొత్తాన్ని మార్కెట్లు తట్టుకోలేవు. ఈ క్రమంలోనే నిబంధనలను సరళీకృతం చేసింది. అంతేకాకుండా, ఐపీవో తర్వాత మార్కెట్ మూలధన విలువ పెరిగిన కొద్దీ పబ్లిక్ వాటాలపై ఉండే నిబంధనలను సరళం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఎల్ఐసీకి ఎంతో మేలు చేయనుంది.