- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLC election: తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరో ఎన్నిక నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad Local Bodies Quota MLC) ఎన్నికకు ఎన్నికల సంఘం (Election Commission) నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల (Notification schedule release) చేసింది. 1 మే 2025న రిటైర్మెంట్ కాబోతున్న ఎం.ఎస్ ప్రభాకర్ రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక జరగబోతున్నది. ఈ నెల 28న నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. 25న ఫలితాలు లెక్కించనున్నట్లు ఈసీ పేర్కొంది. హైదరాబాద్ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది.
ఎంఐఎంకేనా?:
ఈ ఎమ్మెల్సీ (MLC) స్థానం ఎవరికి దక్కబోతున్నదనేది ఆసక్తిగా మారింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మూడు కాంగ్రెస్ కు ఒకటి సీపీఐకి, మరొకటి బీఆర్ఎస్ కు దక్కాయి. అయితే ఆ సయమంలో తమకు సహకరించాలని తద్వారా హైదరాబాద్ స్థానిక సంస్థ సంస్థల కోటా ఎమ్మెల్సీకి మీకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజం అయితే ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని దించకుండా ఎంఐఎంకు మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ అవలంభించబోతున్నారనేది ఆసక్తి రేపుతున్నది.
నోటిఫికేషన్ షెడ్యూల్:
నోటిఫికేషన్ రిలీజ్: 28 మార్చి 2025
నామినేషన్ కు ఆఖరి తేది: 4 ఏప్రిల్ 2025
నామినేషన్ల పరిశీలన: 7 ఏప్రిల్ 2025
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు: 9 ఏప్రిల్ 2025
పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్ 2025
ఓట్ల లెక్కింపు: 25 ఏప్రిల్ 2025