ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వేసవి సెలవుల్లో మార్పు.. తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమంటే?

by Jakkula Mamatha |
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వేసవి సెలవుల్లో మార్పు.. తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ బోర్డు(Intermediate Board) 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఇంటర్ విద్య(Education)లో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్‌(Academic Calendar)ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. వచ్చే(ఏప్రిల్) నెల 7న ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఈ క్రమంలో ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగనున్నాయి. అనంతరం ఏప్రిల్ 24 నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు(Summer Holidays) కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి. దీంతో విద్యార్థులు(Students) ఒత్తిడి(Stress) లేకుండా చదువులపై పూర్తిగా దృష్టి పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించిన ఈ వివరాలను ఇంటర్ బోర్డు(Inter Board) త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed