Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. భారత జవాన్ వీర మరణం

by Shiva |   ( Updated:2025-04-24 05:28:37.0  )
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. భారత జవాన్ వీర మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని ఉధంపూర్ జిల్లా (Udhampur District) బసంత్‌గఢ్‌ (Basantgarh)లో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారని భద్రతా బలగాలకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు అప్రమత్తమైన వారు హుటాహుటిన ఇవాళ ఉదయం స్పాట్‌కు చేరుకున్నారు. అయితే, బసంత్‌గఢ్ (Basantgarh) దట్టమైన అటవీ ప్రాతం కావడంతో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య విరామం లేకుండా ఎదురుకాల్పులు కొనసాగుతుండగా.. ఓ జవాన్‌ తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం బేస్ క్యాంపుల నుంచి స్పాట్‌కు ఉన్నతాధికారులు భారీగా అదనపు బలగాలను బసంత్‌గఢ్‌కు పంపుతున్నట్లుగా సమాచారం.

మరోవైపు కశ్మీర్‌ (Kashmir)లో పర్యాటక రంగం పరిరక్షణకు కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. పహల్గాం (Pahalgam) ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో భద్రత అవసరమని ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shahకు వివరించారు. దీంతో సైన్యం, పారా మిలటరీ (Para Military) బలగాలను అన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో శాశ్వతంగా మోహరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అమర్‌నాథ్ (Amarnath) యాత్రకు ముందే అక్కడ కేంద్ర బలగాలు భద్రతా ప్రణాళికను అమలు చేయనున్నాయి.


Advertisement
Next Story

Most Viewed