- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Visakha IPL: విశాఖలో ఐపీఎల్ సందడి.. రాత్రి వరకు ట్రాఫిక్ఆంక్షలు

దిశ డైనమిక్ బ్యూరో: విశాఖ (Visakhapatnam) వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ క్రికెట్ (IPL Cricket Mach) మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్జెయింట్స్(DC vs LSG) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. స్టేడియం వద్ద 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ గ్రౌండ్లో కొద్ది రోజుల కిందట 34 ఆడియన్స్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. విశాఖలో జరగనున్న రెండు మ్యాచ్ల కోసం రూ.40 కోట్లతో వీడీసీఏ (ACA-VDCA) అంతర్జాతీయ స్టేడియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. మ్యాచ్ కి రెండు గంటల ముందుగా ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ మ్యాచ్ కి విచ్చేసి తిలకించనున్నారు. ఆయనతోపాటు ఉత్తరాంధ్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు మ్యాచ్ను వీక్షించనున్నారు. జాతీయ రహదారి పక్కనే స్టేడియం ఉండటం వల్ల ట్రాఫిక్ కాంక్షలను అమలు చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది.
విశాఖలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. విశాఖ నుంచి వచ్చే వాహనాలను వికన్వెన్షన్ వద్ద బి గ్రౌండ్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలకు సాంకేతిక కాలేజీలో పార్కింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు దారి మళ్ళించారు. విజయవాడ వెళ్లే వాహనాలను ఆనందపురం, అనకాపల్లి రహదారి వైపు మళ్లించారు. విజయవాడ నుంచి విశాఖ వచ్చే వాహనాలను కూడా దారి మళ్ళించారు. విశాఖ వచ్చే వాహనాలను అనకాపల్లి, అనంతపురం, ఎన్ హెచ్ వైపు మళ్ళించారు.