Ex Minister Rajani: కేసు ఆపాలని రజని రాయబారం పంపారు!.. ఎంపీ లావు సంచలన వ్యాఖ్యలు

by Anil Sikha |   ( Updated:2025-03-24 06:52:58.0  )
Ex Minister Rajani: కేసు ఆపాలని రజని రాయబారం పంపారు!.. ఎంపీ లావు సంచలన వ్యాఖ్యలు
X

పది రోజుల క్రితం ఒకరిని నా దగ్గరికి పంపారు ..

మధ్యవర్తి దగ్గర డబ్బులు చెల్లిస్తామన్నారు

పీ లావు కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు

తప్పు చేయకపోతే ఎందుకు రాయబారం పంపారని ప్రశ్న

మంత్రి రజిని ఆరోపణలపై స్పందించిన లావు


దిశ డైనమిక్ బ్యూరో: ' పది రోజుల కిందట ఒక వ్యక్తిని నా దగ్గరకు పంపించారు.. మేము టౌన్ క్రషర్స్ కు డబ్బులు ఇస్తాం అని చెప్పారు.. మేము ఇవ్వవలసిన డబ్బులు గుంటూరులో కౌన్సిలర్ దుర్గారావు అనే వ్యక్తి దగ్గర పెడతాము.. ఈ కేసులు వెనక్కి తీసుకోండి..' అని చెప్పారు.. తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP krishnadevarayali) ప్రశ్నించారు 'నేను కాల్ డేటా (Call data) తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు.. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. అలాంటి క్యారెక్టర్ నాది కాదు' అని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా తన కాల్ డేటాను తీసుకున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజిని (Vidadala Rajani) చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేయడం కాదు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఐపీఎస్ అధికారి జాషువా (IPS Jasshuva) స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్లు ఆయన మీడియా ముందు పెట్టారు. బెదిరించి డబ్బులు లాక్కున్నారని రజనీపై పోలీస్ స్టేషన్లో స్టోన్ క్రషర్స్ యజమానులు ఫిర్యాదు చేశారని తెలిపారు. నేను ఫిర్యాదు చేసినట్టు ఆ వాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాల్ డేటా, భూముల విషయం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అన్నారు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలు అవుతారు అన్నారు. ఐపీఎస్ అధికారులను బెదిరించింది మీరు కాదా అని ప్రశ్నించారు. అక్రమాలు చేసింది మీరు రెడ్ బుక్ (Redbook) అంటూ మళ్ళీ బుకాయింపుల అని అన్నారు. తాము 40 ఏళ్లుగా విజ్ఞాన్‌ సంస్థలు నడుపుతున్నాం అన్నారు. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు అన్నారు. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంవేస్తే.. పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నాం అని పేర్కొన్నారు. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐపీఎస్ అధికారి జాషువా ఇచ్చిన స్టేట్మెంట్లను మీడియాకు ఇచ్చారు.

Next Story

Most Viewed