- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సెర్చింగ్ ఫర్ షీలా’.. బయోటెర్రర్ అటాక్‌పై నెట్‌ఫ్లిక్స్ ఫ్యాక్ట్స్!
దిశ, సినిమా: నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ‘సెర్చింగ్ ఫర్ షీలా’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గుజరాత్‌కు చెందిన ‘మా ఆనంద్ షీలా’ ఇండియన్ స్పిరిచువల్ గురువు రజనీష్ శిష్యురాలిగా మారినప్పటి నుంచి.. అమెరికాలో రజనీష్‌పురమ్ ఆశ్రమం ఏర్పాటు చేయడం, తనకు పర్సనల్ అసిస్టెంట్‌గా నియామకం, ఆ తర్వాత రజనీష్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌గా అంచలంచెలుగా ఎదిగింది. ఈ క్రమంలో రజనీష్ బృందం చేసిన క్రిమినల్ యాక్టివిటీస్‌కు తను ఎలా బలైంది? అమెరికా వాస్కో కంట్రీ కోర్ట్స్ ఎలక్షన్స్‌లో పోటీచేయాలనుకున్న షీలా.. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఏం చేసింది? అందులో ఫెయిల్ కావడంతో తనే బయో వెపన్స్(రజనీష్ బయో టెర్రర్ అటాక్) ప్రయోగం చేయించిందా? ఇందులో ఎవరి హస్తముంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. కానీ బయో అటాక్ కేసులో దోషిగా అమెరికాలో జైలు శిక్ష అనుభవించి, సత్ప్రవర్తనతో బయటకొచ్చిన తర్వాత స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. ఆ తర్వాత తన రియాలిటీని నిరూపించుకునేందుకు ఇండియాకు తిరిగొచ్చింది.
ఈ క్రమంలో తను రాసిన రజనీష్ ఇజమ్ బుక్ ఆధారంగా ఇంతకు ముందే 2018లో నెట్‌ఫ్లిక్స్ స్టోరి ‘వైల్డ్ వైల్డ్ కంట్రీ’ రాగా.. ఆ తర్వాత బీబీసీ తన పర్సనల్ ఇంటర్వ్యూస్ కలెక్షన్స్‌తో ‘వైల్డ్ వైల్డ్ కంట్రీ: వాట్ హాపెన్డ్ టు షీలా’ పేరుతో తమ యూట్యూబ్ చానల్‌లో స్టోరీ ప్రసారం చేసింది. కాగా ఇప్పుడు తన లైఫ్ బేస్ చేసుకుని ‘సెర్చింగ్ ఫర్ షీలా’ పేరుతో మరో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా, ఇండస్ట్రీతో పాటు ఇండియా అటెన్షన్‌ను క్యాచ్ చేసింది. షీలా వ్యక్తిగత జీవితంపై పూర్తిగా దృష్టిసారించబోతున్న ఈ డాక్యుమెంటరీలో.. 34 ఏళ్ల తర్వాత సొంత దేశం ఇండియాకు వచ్చిన ఆమె, తన ప్రారంభ జీవితం గురించి ఏం చెప్తుంది? దేని కోసం అన్వేషిస్తోంది? ఇంతకీ షీలాకు విముక్తి దొరికిందా లేదా? తను క్రిమినలా లేక ప్రేమలో ఉన్న స్త్రీనా? మంచిదా, చెడ్డదా? నిజంగానే తను బయో అటాక్ చేసిందా? ఇన్ని ప్రశ్నలకు ఈ డాక్యుమెంటరీ ద్వారా సమాధానం ఇవ్వబోతోంది.