- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. స్కూల్ బయట విద్యార్థుల పడిగాపులు
X
దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లాలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమయం దాటినప్పటికీ స్కూల్‌ను తెరవలేదు. దీంతో విద్యార్థులు స్కూల్ బయటే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే కమలాపురం నగర పంచాయతీలోని బస్టాండ్ వద్ద ఉన్న మెయిన్ ఎలిమెంటరీ స్కూలును 9.30 గంటలకు తెరవాల్సి ఉంది. సమయం దాటినా పాఠశాలను తెరవకపోవడంతో విద్యార్థులు స్కూల్ బయటే ఉండాల్సి వచ్చింది. దీంతో కొందరు స్థానికులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈవో జాఫర్ సాదిక్ స్కూల్ టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే స్కూలు తాళాన్ని స్థానికంగా ఉండే పారిశుధ్య కార్మికురాలికి ఇచ్చామని.. ఆమె పెళ్లికి వెళ్లడంతో తాళం తీయడం ఆలస్యమైందని ఉపాధ్యాయులు వెల్లడించారు.
Advertisement
- Tags
- kadapa
- Negligence
Next Story