- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేము సమీక్షించమండీ..కట్టాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్: టెలికాం సంస్థలపై అత్యున్నత న్యాయస్థానం మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ ఛార్జీల విషయంలో పునఃసమీక్ష ఉండే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. సవరించిన స్థూల ఆదాయం అంశంలో స్వీయ మదింపు చేయమని ఎవరు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు వసూలు చేసే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టును ప్రభావితం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, అలాంటివి కుదరదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పునఃసమీక్షను అంగీకరిస్తే గతంలో కోర్టు తీర్పుని తప్పుబట్టినట్లు అవుతుందని స్పష్టం చేసింది. దానికి అనుమతించే అధికారుల్ని సహించమని హెచ్చరించింది. గతంలో ఏజీఆర్ బకాయిలను చెల్లించి తీరాలని కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, టెలికాం సంస్థలు మళ్లీ మళ్లీ తీర్పును పునఃసమీక్షించాలని కోర్టు మెట్లెక్కాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
ఇప్పటివరకూ కొంత చెల్లించిన టెలికాం సంస్థలు మిగిలిన మొత్తాలకు మినహాయింపు లభిస్తుందనే ఆశతో మళ్లీ కోర్టు తలుపు తట్టాయి. ఈసారి కూడా టెలికాం కంపెనీలకు ప్రతికూలత ఎదురైంది. ఈ క్రమంలో ఏజీఆర్ బకాయిలను 20 యేళ్ల పాటు వాయిదాల రూపేణా చెల్లించడానికి కంపెనీలకు వెసులుబాటివ్వాలని కేంద్రం సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్ వేసింది. ఏజీఆర్ ఛార్జీల చెల్లింపుల కారణంగా టెలికాం కంపెనీలు పనితీరు తగ్గితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావముంటుందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ ప్రభావం వినియోగదారులపై కూడా పడుతుందని వివరించింది. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనున్నట్టు చెప్పింది.