ఎస్‌బీఐ కార్డ్ తొలి త్రైమాసిక ఆదాయం రూ. 2,196 కోట్లు

by  |
ఎస్‌బీఐ కార్డ్ తొలి త్రైమాసిక ఆదాయం రూ. 2,196 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 393 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 364 కోట్లను నమోదు చేసింది. ఇక, తొలి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 4 శాతం పెరిగి రూ. 2,196 కోట్లు ఉండగా, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 2,304 కోట్లుగా ఉండేది. బోర్డు ఆమోదించిన విధానాలను అనుగుణంగా అర్హత గల రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ కార్డ్ క్రెడిట్ కార్డ్ బకాయిలపై మారోటియం వెసులుబాటు కల్పించిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

వడ్డీ ఆదాయం 34.6 శాతం పెరిగి రూ. 1,412 కోట్లకు చేరుకుంది. ఫీజులు, సేవల ద్వారా కంపెనీ ఆదాయం రూ. 688 కోట్లు ఉండగా, గతేడాది ఇది రూ. 916 కోట్లుగా ఉండేది. తొలి త్రైమాసికం కంపెనీ మొత్తం వ్యయంలో దాదాపు 28 శాతం క్షీనించి రూ. 134.98 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ బ్యాడ్ లోన్స్ ఖర్చులు రూ. 485 కోట్లుగా ఉంది. ఇక, ఎస్‌బీఐ కార్డ్ బ్యాలెన్స్ షీట్ జూన్ 30 నాటికి రూ. 24,260 కోట్లుగా ఉంది. గతేడాది మార్చి నాటికి ఇది రూ. 25,303 కోట్లు. జూన్ 30 నాటికి మొత్తం స్థూల క్రెడిట్ కార్డుల రాబడులు 9.9 శాతం పెరిగి రూ. 23,330 కోట్లుగా ఉంది. కాగా, కంపెనీ నికర విలువ రూ. 5.7 శాతం వృద్ధితో రూ. 5,722 కోట్లుగా ఉంది.


Next Story