పండుగ ఆఫర్‌ను ప్రకటించిన ఎస్‌బీఐ

by Harish |
పండుగ ఆఫర్‌ను ప్రకటించిన ఎస్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ ఆఫర్‌లో భాగంగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గృహరుణాలు తీసుకున్నవారికి శుభవార్త తెలిపింది. ఇదివరకు ఇచ్చిన పండుగ ఆఫర్‌ను కొనసాగిస్తూ గృహరుణాలపై వడ్డీ రేట్లకు 25 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీని ప్రకటించింది. ఖాతాదారుల సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీపై 25 బేసిస్ పాయింట్ల రాయితీని కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. అయితే, యోనో యాప్ ద్వారా రూ. 75 లక్షలకు పైన గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు ఈ రాయితీ వర్తించనున్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. యోనో యాప్ ద్వారా కారు, బంగారం, వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు గత నెల చివరిలో బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజులో వంద శాతం మాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే రాయితీనికి 8 మెట్రో నగరాల్లో రూ. 3 కోట్లలోపు గృహరుణాలపై కూడా ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అలాగే, యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కాగా, ప్రస్తుత ఎస్‌బీఐ రూ. 30 లక్షల కంటే తక్కువ విలువైన గృహరుణాలపై కనిష్టంగా 6.90 శాతన్ నుంచి వడ్డీని ఇస్తుండగా, రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఉంటే 7 శాతం కనిష్ట వడ్డీగా నిర్ణయించింది.

Advertisement

Next Story