కరోనాను తరిమి కొట్టండి: మంత్రి సత్యవతి

by Shyam |
కరోనాను తరిమి కొట్టండి: మంత్రి సత్యవతి
X

దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కరోనా కట్టడికి అమలు చేస్తున్న చర్యలను శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ కరోనా నివారణకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. అలాగే, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్‌ను అమలు చేయడంలో పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఇందుకు ప్రజలూ సహకరిస్తున్నారనీ, అందుకే క్వారంటైన్‌లో ఉన్నవారు త్వరగా డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తిని ఏప్రిల్ 14 వరకు కొనసాగించాలని విజ్ణప్తి చేశారు. కొందరు మాత్రమే నిబంధనలను ఉల్లఘిస్తున్నారనీ, అలాంటి వారిపై పోలీసులు కఠినంగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించారు. అయితే, నివారణ చర్యల్లో భాగంగా కొన్ని గ్రామాల్లోని యువత సరిహద్దుల్లో ముళ్ల కంచెలు వేస్తున్నారనీ, వారి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అత్యవసర సేవలు అందించే సమయంలో ఈ కంచెలు ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పారు. అనంతరం ములుగు జిల్లాలో మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Tags: satya rathod, mulugu, mahaboobabad, corona, virus, masks distributed,

Advertisement

Next Story

Most Viewed