టీఈఏ మెడికల్​ విభాగం ఛైర్మన్​గా సత్యనారాయణ

by Shyam |
టీఈఏ మెడికల్​ విభాగం ఛైర్మన్​గా సత్యనారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పీఆర్సీ కోసం ఉద్యోగ వర్గాలు కలిసి రావాలని, ఇప్పుడు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందని తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి పిలుపునిచ్చారు. టీఈఏ వైద్యారోగ్య శాఖ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అసోసియేషన్​ కార్యాలయంలో బుధవారం జరిగింది.

ఈ సందర్భంగా టీఈఓ విభాగం నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంపత్​ కుమారస్వామి ప్రకటించారు. టీఈఏ వైద్యారోగ్య శాఖ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పూజల భరత్​ సత్యనారాయణను ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ రాష్ట్ర కమిటీ సలహాలు, సూచలతో వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతానన్నారు.

Advertisement

Next Story