శనివారం పంచాంగం, రాశిఫలాలు (12-06-2021)

by Hamsa |
శనివారం పంచాంగం, రాశిఫలాలు (12-06-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ (నిన్న రాత్రి 6 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 15 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర (నిన్న మధ్యాహ్నం 2 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ వరకు)
యోగము : గండము
కరణం : బాలవ
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 29 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 54 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 39 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి 8 గం॥ 18 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ నుంచి 10 గం॥ 36 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 41 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 19 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 54 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 32 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మిథునము

మేష రాశి : స్నేహితులు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇది మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. వారితో ఆనందంగా గడుపుతారు. తోడబుట్టిన వారితో ఆస్తి వివాదాలు రావచ్చు జాగ్రత్త. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్థులకు లాభాలు. చిన్ననాటి స్నేహితులతో పాత మధుర జ్ఞాపకాలు పంచుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో ఇంట్లో శుభకార్యాల పై చర్చిస్తారు.

వృషభ రాశి : ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయండి. అనుకున్న కార్యాలను పూర్తి చేయాలంటే అధిక శ్రమ పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త. కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం కొరకు మరియు పిల్లల చదువుల కొరకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఆదాయం బాగుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.ఈ రాశి స్త్రీలకు మీ భర్త పూర్తి సమయాన్ని మీతో గడపటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మిధున రాశి : ప్రయాణాలలో అనుకోని అవాంతరాలు ఉండవచ్చు వీలైతే వాయిదా వేయండి. స్థిరస్తి కొనుగోలుకు మీరు చేస్తున్న ప్రయత్నాలలో ధర మీకు అందుబాటులో ఉండదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి శ్రద్ధ పెట్టండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులపై ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆఫీస్ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటుంబంలోని వ్యక్తుల కొరకు తగినంత సమయం కేటాయించండి వారు మీ మీద కోపంగా ఉన్నారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి : అవసరాలకు తగినంత ధనాదాయం. ప్రయాణాలు అనుకూలం. విద్యార్థులు టీవీ, మొబైల్ లను పక్కకు పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకండి ఆఫీసు పనిలో అధిక బాధ్యతలు ప్రణాళిక ప్రకారం పని చెయ్యండి. ఆశావహ దృక్పథంతో పనులను పూర్తి చేయండి. ఆరోగ్యం బాగుండాలంటే బయట భోజనం మానివేయండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి : స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులపై పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆఫీస్ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు మీ తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మనసువిప్పి మాట్లాడటం వల్ల అపార్థాలు తొలగి అందరూ ఆనందంగా ఉంటారు. అవసరాలకు మించి ఆదాయం లభిస్తుంది. పొదుపు చేయండి. విద్యార్థులు అనవసర విషయాలు ఆలోచించడం వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేరు సమయం వృధా. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ వలన మనసుకి ఎంతో ఆనందం.

కన్య రాశి : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆఫీసు పనిలో అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ అన్ని పనులను సమయంలో పూర్తి చేస్తారు. ప్రేమికులకి ప్రేమ సఫలం. ధనాదాయం బాగుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఫిట్ నెస్ కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాల వలన మంచి ఆరోగ్యం. వ్యాపారస్తులకు మంచి లాభాలు. వ్యాపార పరమైన ప్రయాణాలు గొప్ప అవకాశాలను తెస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆలోచనలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

తులారాశి : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. కొంతమందికి వంశపారపర్య స్థిరాస్తి లభించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీస్ పనులను పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం బాగున్నా అనవసరపు దుబారా ఖర్చులు మిమ్మల్ని అశాంతికి గురి చేస్తాయి. కుటుంబ సభ్యులతో ఈ విషయం మీద లెక్చర్ ఇస్తారు. అందరూ ఏమన్నా మీరు పట్టించుకోరు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. బయట భోజనం వలన అజీర్తి ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : మీ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చెయ్యటానికి కొంత మంది వేచి ఉన్నారు జాగ్రత్త. కొన్ని అదనపు బాధ్యతలు మీద పడతాయి. నిరాశను వదిలేయండి. ఆశావహ దృక్పథం మంచి ఫలితాలనిస్తుంది. ఆఫీసు పనులను పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం బాగున్నా అనవసరపు దుబారా ఖర్చులు చేస్తారు. సరైన సమయానికి సరైన భోజనము మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బయటి భోజనం వల్ల అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో మాట్లాడేటప్పుడు పాత గొడవలు అవ్వకండి. మీకే నష్టం.

ధనస్సు రాశి : దైవ ప్రార్థన మీకు మనశాంతిని ఇస్తుంది. అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆదాయం బాగుంది. డబ్బులు పొదుపు చేస్తారు. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు దైవ బలం తోడవుతుంది. అన్ని కార్యాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. సహోదర వర్గం సహాయం లభిస్తుంది. ఆఫీసు పనులను చాకచక్యంగా పూర్తిచేస్తారు. అనవసర, పనికిమాలిన విషయాల గురించి ఆలోచించి సమయం వృధా చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకుంటారు.

మకర రాశి : ఆశావహ దృక్పథం, పట్టుదలతో అన్ని కార్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. అందరి సలహాలు తీసుకున్నా తుది నిర్ణయం మీరే చేయండి. ఈ రోజు ఆఫీసు పనులను చిటికెలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం చక్కబడుతుంది. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. డబ్బులు పొదుపు చేస్తారు. దుబారా ఖర్చుల జోలికి పోకండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు మీ భర్తతో గొడవలకు దారి తీయవచ్చు జాగ్రత్త.

కుంభ రాశి : నిరాశావాదం, గందరగోళం వదిలిపెట్టండి. దాని వలన మానసిక అనారోగ్యం. పనులతో తీరిక లేకుండా గడపడం ఒక మంచి ఉపాయం. ఇతరులు ఏమనుకున్నా మీరు నిజాయితీ అని నమ్మిన దానిని ఆచరించండి. కుటుంబంలో పెద్ద వారి దీవెనలు తీసుకోండి. ఆఫీసు పనిలో నూతన బాధ్యతల వలన అధిక శ్రమ. బయట వారితో అనవసరపు వాదోపవాదాలకు దిగకండి. అనవసరపు దుబారా ఖర్చు మిమ్మల్ని అశాంతికి గురి చేస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో మనసువిప్పి మాట్లాడటం వల్ల అపార్థాలు తొలగి పోతాయి.

మీన రాశి : ఆశావాహ దృక్పథం పట్టుదలతో అన్ని కార్యాలను పూర్తి చేస్తారు. మెడిటేషన్ మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆఫీసు పనులలో నూతన బాధ్యతల వలన అధిక శ్రమ. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అధిక శ్రమ వలన భుజాల నొప్పులు, వెన్నునొప్పి. బయట వారితో అనవసరపు వాదోపవాదాలకు దిగకండి. అనవసర పనికిమాలిన విషయాల గురించి ఆలోచించి సమయం వృధా చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

Advertisement

Next Story

Most Viewed