- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్స్ లైటెస్ట్ శాటిలైట్స్.. తంజావూరు విద్యార్థి ఘనత
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల విద్యార్థులు పాల్గొన్న ‘క్యూబ్స్ ఇన్ స్పేస్’(క్యూఐఎస్) గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్‌లో తంజావూరుకు చెందిన 18 ఏళ్ల రియాస్దీన్ విజేతగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నాడు. తమిళనాడులోని శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీలో మెకాట్రోనిక్స్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రియాస్దీన్ ప్రపంచంలోనే అత్యంత తేలికైన శాటిలైట్లను రూపొందించి సరికొత్త చరిత్ర సృష్టించగా, నాసా రాకెట్ మిషన్‌లో రీయాస్దీన్ రూపొందించిన శాటిలైట్లు భాగం కానున్నాయి.
క్యూబ్స్ ఇన్ స్పేస్ -2020 గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్‌లో ఈ ఏడాది 73 దేశాల నుంచి మొత్తం వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనగా, ఈ పోటీల్లో రియాస్దీన్ విజేతగా నిలిచాడు. అతడు రూపొందించిన రెండు ఉపగ్రహాలు 37 మిల్లీమీటర్ల పరిమాణంతో 33 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. వాటికి విజన్ శాట్ వీ1 ( VISION SAT v1), విజన్ శాట్ వీ2( VISION SAT v2) అనే పేర్లు పెట్టాడు. వీటిని రూపొందించడానికి పాలిథెరిమైడ్ థర్మోప్లాస్టిక్ రెసిన్స్, 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించాడు. కాగా రియాస్దీన్ రూపొందించిన ఉపగ్రహాలు ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఫెమ్టో (FEMTO) శాటిలైట్లుగా గుర్తింపు దక్కించుకోవడమే కాకుండా, వీ1 శాటిలైట్ ‘ఎస్ఆర్ -7’ నాసా రాకెట్ మిషన్‌లో చోటు దక్కించుకుంది. ఈ ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో వర్జీనియాలోని వాలొప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ వేదికగా లాంచ్ కానుంది. వీ2.. ‘ఆర్‌బీ -6’ బెలూన్ మిషన్‌లో భాగం కానుండగా, 2021 ఆగస్టులో నాసా దీన్ని ప్రయోగించనుంది.
‘నాకు చిన్నప్పటి నుంచే రోబోటిక్స్ అంటే ఇష్టం ఉండటంతో రోబోటిక్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం నుంచి రోబోటిక్స్‌లో శిక్షణ తీసుకున్నాను. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ కాంటెస్ట్‌లలో విజేతగా నిలిచాను. శాస్ర్త యూనివర్సిటీలోని ఇంక్యుబేషన్ సెంటర్‌లో త్వరలోనే స్టార్టప్ ప్రారంభించబోతున్నాను. ఇందుకు యూనివర్సిటీ కూడా గ్రాంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని రియాస్దీన్ తెలిపాడు. రియాస్దీన్ ప్రతిభను గుర్తించిన శాస్త్ర యూనివర్సిటీ, అతడికి రూ.5 లక్షల ఇంక్యుబేషన్ గ్రాంట్‌ను అందిచేందుకు ముందుకు వచ్చినట్లు శాస్ర్త యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వైద్యసుబ్రమణ్యం తెలిపారు. డీఎంకే ప్రెసిడెంట్ ఎమ్‌కె స్టాలిన్, టీఎమ్‌సీ ప్రెసిడెంట్ జీకే వాసన్, ఏఎమ్ఎమ్‌కే లీడర్ టీటీవీ దినకరణ్‌లు రియాస్దీన్‌ను అభినందించారు.