సర్పంచ్ భర్తతో.. మహిళ కాళ్లు మొక్కించిన పెద్దలు

by Shyam |
సర్పంచ్ భర్తతో.. మహిళ కాళ్లు మొక్కించిన పెద్దలు
X

దిశ, బోధన్: ఆయన ఒక అధికార పార్టీ నేత, అందులో సర్పంచ్ భర్త. గ్రామంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి వక్రబుద్ధి చాటుకున్నారు. గ్రామానికి చెందిన వివాహిత మహిళకు రాత్రిపూట ఫోన్ చేసి వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంచాయితీ నిర్వహించిన గ్రామ పెద్ధలు అతడికి బుద్ది చెప్పారు. ఈ సంఘటన బోధన్ మండలంలోని అమ్దాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సర్పంచ్ భర్త సిర్ప సుదర్శన్. ఒక మహిళను రాత్రి సమయంలో ఫోన్ చేసి వేధింపులు గురి చేసినందుకు గాను గ్రామస్తులు హనుమాన్ మందిరం వద్ద పంచాయితీ పెట్టించి సిర్ప సుదర్శన్‌తో మహిళ కాళ్ళు మొక్కించారు. ఇటీవల బోధన్ నియోజకవర్గంలో వరుసగా అధికార టీఆర్ఎస్ నాయకులు మహిళలపై వేధింపులు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ గ్రామంలో కట్టుబాట్లు ప్రజాప్రతినిధి, నాయకుడు అని చూడకుండా గ్రామ పెద్ధలు అతని చేత చేసిన తప్పును ఒప్పించి శిక్షించడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed