కాయ్ రాజా కాయ్.. సర్పంచ్ పదవి 44 లక్షలు మాత్రమే..

by Anukaran |   ( Updated:2021-12-16 11:39:23.0  )
కాయ్ రాజా కాయ్.. సర్పంచ్ పదవి 44 లక్షలు మాత్రమే..
X

దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ పదవి అంటే గ్రామంలో యమ క్రేజు. అక్కడ దొరికే హోదా సీఎం కూడా దొరకదని తెగ ఫీలైపోతుంటారు. అంతేనా ఆ పదవి కోసం యావదాస్థిని అమ్మడానికి కూడా వెనుకాడరు. ఇల్లూ, వాకిలి అమ్మి ఎన్నికల్లో పోటీకి నిలబడతారు. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరైనా ఎన్నికల్లో నిల్చోవచ్చు. అయితే కొన్ని సార్లు ఎన్నికల కమిషన్ కొన్ని వర్గాల ప్రజలకు కేటాయిస్తూ ఉంటుంది.

అయితే ఈ నియమాలేవి మధ్యప్రదేశ్ లోని భతౌలి గ్రామంలో చెల్లవు. ఎందుకు అంటే ఇక్కడ సర్పంచ్ కావాలి అంటే వేలం పాటలో పాల్గొనాల్సిందే. పాట పాడుకుని పదవి కొనాల్సిందే. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే డబ్బు మొత్తం ఎలక్షన్ కు ముందు రోజు లోపు కట్టేయాలి. అలా కట్టలేక పోతే అతని కంటే తక్కువ పాడిన రెండో వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకుంటారు.

మధ్యప్రదేశో లో ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అశోక్ నగర్ జిల్లా భతౌలి గ్రామ ప్రజలు వింత ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ఈ నెల డిసెంబర్ 14 న ఓ దేవాలయం లో మీటింగ్ బెట్టి ఎవరెవరు అయితే సర్పంచ్ పదవికి పోటీ చేయాలి అనుకుంటున్న ఐదుగురిని పిలిపించారు. ఎవరు ఎక్కువ మొత్తంలో పాడితే వారికే సర్పంచ్ పదవి అని ప్రకటించారు. ఇంకేముంది దేవుని పాట 21 లక్షలతో మొదలై లక్షణంగా 44 లక్షలకు ముగిసింది. సౌబాగ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఈ పాటలో పదవి దక్కించుకున్నాడు. ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారిదే పదవి అని చెప్తున్నారు. అయినా ప్రజాభీష్టం ముందు అధికారులు ఏమి చెబితే మాత్రం చెల్లుతుంది..?

Advertisement

Next Story