- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీటింగ్‌కు రాలేదని..సర్పంచ్ భర్త కులబహిష్కరణ
దిశ, నిజామాబాద్: సంఘం సమావేశాలకు హాజరు కాలేదనే కారణంతో సాక్షాత్తు గ్రామ సర్పంచ్ భర్తను తోటి కులస్తులు గ్రామం నుంచి బహిష్కరణ చేశారు. దీంతో చేసేదేమీ లేక అతను మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ ఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన చెప్యాల గంగారం తన కుల సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. భార్య సర్పంచ్ అయ్యాక సంఘం సమావేశాలకు హాజరు కాలేదు.ఈ నేపథ్యంలో కుల సంఘం బాధ్యులు గంగారంను కుల బహిష్కరణ చేశారు.గత రెండేండ్లుగా తనతో కుల సభ్యులు ఎవరూ మాట్లాడాటం లేదని, పండుగలు, పబ్బాలకు పిలువడం లేదని హెచ్చార్సీ ఎదుట వాపోయాడు. కుల కట్టుబాట్లు మీరిన వారికి రూ.10,000 జరిమాన విధించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తన కులసంఘం సభ్యులు ఐదుగురి పైన హెచ్చార్సీలో ఫిర్యాదు చేశాడు.