డబ్బులు అడిగినందుకు సర్పంచ్ దాడి

by Sridhar Babu |
డబ్బులు అడిగినందుకు సర్పంచ్ దాడి
X

దిశ, గుండాల: ఇచ్చిన డబ్బులు అడగటంతో పాటు మిషన్ భగీరథ లో పనిచేసిన జీతం డబ్బులు అడిగితే గుండాల మండలం ముతాపురం గ్రామ సర్పంచ్ పుణ్యం సమ్మయ్య అకారణంగా దాడిచేసి కొట్టాడని పూర్వక గ్రామానికి చెందిన గాంధరల గణేష్ ఆరోపించారు. సోమవారం సాయంత్రం గుండాల ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. సర్పంచ్ సమ్మయ్య తన భార్య కోకిలకు తూరుబాకా గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఉద్యోగం ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఇప్పిస్తానని, అందుకు ఖర్చు రూ.28,000 అవుతాయని తన దగ్గర ఇరవై ఎనిమిది వేలు తీసుకుని రెండు సంవత్సరాల తర్వాత 10000 చెల్లించి 18000 బకాయి ఉన్నాడని తెలిపాడు. దీంతోపాటు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు మిషన్ భగీరథ లో పంప్ ఆపరేటర్ గా పని చేసిన ఎనిమిది వేల జీతం చెల్లించమని ఈరోజు సాయంత్రం 5:30కు మోదుగుల గూడెం తనను ప్రశ్నించగా తనపై అకారణంగా దాడి చేశారని చెప్పాడు. సర్పంచ్ పై చర్య తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపాడు.
.

Advertisement

Next Story