సూపర్‌స్టార్ బర్త్‌డేకు సూపర్ ట్రీట్ ఏంటంటే?

by Anukaran |
సూపర్‌స్టార్  బర్త్‌డేకు సూపర్ ట్రీట్ ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. నట శేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తొలి పోస్టర్, మహేష్ ఆఫ్ లుక్ చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రిన్స్ పుట్టినరోజు ఆగస్టు 9న ‘సర్కారు వారి పాట’ చిత్రయూనిట్ నుంచి ఏం గిఫ్ట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఎగ్జైయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ అభిమానులు అనుకున్నట్లే ఈ మూవీ నుంచి ఓ సూపర్ ట్రీట్ ఉంటుదని థమన్ క్లూ ఇచ్చాడు.

మహేశ్ బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూవీలోని ఓ డైలాగ్‌ను కూడా వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే మహేశ్ ఓ మైక్ ముందు కూర్చున్న స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ‘రెడీగా ఉన్నారా’ అంటూ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు అభిమానులకు ‘సర్కారు వారి పాట’ టీమ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్‌ను ఇవ్వనున్నారని స్పష్టమైంది. ‘సర్కారు వారి పాట’ నుంచి మహేశ్ టోటల్ లుక్‌కు సంబంధించిన మరో పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. దేశంలో కరోనా విజృంభిస్తోన్నందున అందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని మహేశ్ తన ఫ్యాన్స్‌ని కోరారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియాలోనే మహేశ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు.

ఇదిలా ఉంటే…మహేశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ? ఎవరితో అన్నది కూడా అభిమానులు తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మహేశ్ బాబు‌తో దర్శక ధీరుడు జతకట్టనున్న విషయం తెలిసిందే. కానీ, అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేట్ అయిపోయింది. సో అది విడుదలయ్యే వరకు రాజమౌళి బిజీ. మరి మహేశ్ ఈలోగా ఇంకో సినిమా పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వంశీ పైడిపల్లి, ఖైదీ ఫేం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కేజీఎఫ్ ఫేం దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు తెరమీదకు వచ్చాయి. మరి మహేశ్ ఎవరితో చేస్తాడు? ఈ సందేహాలన్నీ ఆగస్ట్ 9న తెలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story