మాల్దీవులకు బయలుదేరిన సారా అలీఖాన్.. ఎవరితో తెలుసా?

by Jakkula Samataha |
మాల్దీవులకు బయలుదేరిన సారా అలీఖాన్.. ఎవరితో తెలుసా?
X

దిశ, సినిమా : కరోనా కారణంగా కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు నిబంధనలు సడలించగానే మాల్దీవ్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి సముద్ర తీరాలు బీటౌన్ స్టార్లకు కేరాఫ్‌గా మారాయి. ఈ మధ్య కూడా పలువురు సెలబ్రిటీలు మాల్దీవ్స్‌లో సేదతీరేందుకు వెళ్లగా.. ఈ రోజు(శనివారం) బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్‌తో కలిసి అక్కడికే పయనమైంది.

ఈ మేరకు ముంబై ఎయిర్ పోర్టులో సారా, అమృత మీడియాకు కనిపించారు. కొద్దిరోజుల కిందటే తన బ్రదర్ ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి కశ్మీర్‌కు వెకేషన్ వెళ్లిన సారా.. తాజాగా తల్లితో కలిసి మాల్దీవ్స్‌కు వెళ్తోందని సమాచారం. వైట్ టాప్, డెనిమ్ షార్ట్స్‌లో ఫ్లవరీ మాస్క్ ధరించి ఉన్న సారా ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో వస్తున్న అక్షయ్‌కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ మూవీ ‘అత్రంగి రే’లో కీలక పాత్ర పోషిస్తుండగా, ఆల్రెడీ తన షూటింగ్ పూర్తి చేసింది.

Advertisement

Next Story