- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెక్ట్స్ సీజన్‌లో ఆ ముగ్గురికీ ఆర్సీబీ కెప్టెన్సీ చాన్స్..?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ పదవి నుంచి వైదొలగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ 20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను ఇకపై మోయబోనని అతడు చెప్పాడు. దీంతో వచ్చే సీజన్‌లో ఆర్సీబీకి కెప్టెన్ ఎవరు అవుతారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏబీ డివిలియర్స్‌కు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉండదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. ఏబీడీ మరో రెండు మూడేళ్లు మాత్రమే ఐపీఎల్ ఆడతాడు.. కానీ ఆర్సీబీ యాజమాన్యం దీర్ఘకాలిక కెప్టెన్ కోసం వెతుకుతున్నదని అన్నాడు. వచ్చే ఏడాది మెగా ఐపీఎల్ ఆక్షన్ ఉండనున్నది.
దీంతో ముంబై ఇండియన్స్‌లో ఉన్న కిరాన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని కొనుగోలు చేసి వారిద్దరిలో ఒకరికి కెప్టెన్సీ ఇస్తుందని మంజేక్రర్ అభిప్రాయ పడుతున్నాడు. పొలార్డ్ వెస్టిండీస్ టీ20 జట్టుతో పాటు, సీపీఎల్‌లో కూడా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ దేశవాళీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉన్నది. వీరిద్దరూ కాకుంటే సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.