బాలయ్యకు బాలీవుడ్ విలన్

by  |
బాలయ్యకు బాలీవుడ్ విలన్
X

నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ అంటే యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టంట్లకు ఎలాంటి కొదువ ఉండదు. ఆల్రెడీ బోయపాటికి బాలయ్యను ఓ రేంజ్‌లో చూపిస్తాడనే పేరుంది. అలాంటప్పుడు బాలయ్యకు విలన్ కూడా అదే రేంజ్‌లో విలనిజాన్ని ప్రదర్శిస్తేనే బొమ్మ హిట్ అవుతుంది. హీరో పవర్ ఫుల్‌గా ఉండి.. విలన్ తేలిపోయాడంటే సినిమా అంతగా మెప్పించదు. అందుకే బాలయ్యకు సరైన ప్రత్యర్థిని సెలెక్ట్ చేశాడు బోయపాటి.

పలు సినిమాల్లో తన విలనిజంతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను బాలయ్య శత్రువుగా సెలెక్ట్ చేశాడు. ఇప్పటికే బోయపాటి సంజయ్‌ను సంప్రదించాడని.. ఈ ప్రపోజల్‌కు తాను కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించబోతుండగా.. ఇద్దరు విలన్లు ఉండబోతున్నారు. ఇప్పటికే డిస్కో రాజా సినిమాలో విలన్‌గా కనిపించిన సునీల్‌ను ఒక విలన్‌గా ఎంపిక చేసిన బోయపాటి.. రెండో విలన్‌గా సంజయ్ దత్‌ను ఆల్మోస్ట్ ఫైనల్ చేసేశారని సమాచారం.

ఈ సినిమా బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో మూడో చిత్రం కాగా.. పక్కా హిట్ అవుతుందని, హ్యాట్రిక్ కంపల్సరీ అనే ధీమాతో ఉన్నారు.


Next Story

Most Viewed