- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్లు డ్రగ్స్ వాడారు.. నిర్ధారించిన ఫోరెన్సిక్ రిపోర్ట్
దిశ, సినిమా : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన కన్నడ హీరోయిన్ సంజనా గర్లానీ, రాగిణి ద్వివేది ఆ తర్వాత బెయిల్ మీద బయటికొచ్చారు. అయితే తాజా ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం.. వీరిద్దరూ మాదకద్రవ్యాలు వాడినట్టు నిర్దారించబడింది. కొంతకాలంగా డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు పోలీసులు.. మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్.. ‘మాదకద్రవ్యాల కేసు దర్యాప్తులో మా పోలీసులు చాలా వేగంగా, నిష్పక్షపాతంగా పని చేశారని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ కేసు ఫైల్ కాగా, ఇప్పటివరకు వీలైనంత పురోగతి సాధించాం’ అని తెలిపారు.
అయితే కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసినందున ఈ సమయంలో ఏమీ చెప్పలేనని, కొంతమంది వ్యక్తులు డ్రగ్స్ తీసుకునేవారని FSL నివేదిక స్పష్టం చేసిందని క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సంజనా గర్లానీ, రాగిణి ద్వివేది నుంచి సేకరించిన హెయిర్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించగా, వారు మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలిందన్నారు. ఇది కేసు తదుపరి విచారణకు మరింతగా సాయపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు.