బుజ్జిగాడు హీరోయిన్ అరెస్ట్..

by  |
బుజ్జిగాడు హీరోయిన్ అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్:

బుజ్జిగాడు హీరోయిన్ ‘సంజనా గర్లాని’ శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్ కేసులో అరెస్ట్ అయింది. బెంగళూరు సిటీలో జరుగుతున్న బిగ్గెస్ట్ పార్టీలకు రాగిణి ద్వివేది డ్రగ్స్ సప్లయ్ చేస్తుందనే ఆరోపణలతో ఇప్పటికే అరెస్ట్ కాగా.. మంగళవారం ఉదయం సంజనాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందిరా నగర్‌లోని తన ఇంట్లో రైడ్స్ జరిపిన సీసీబీ అధికారులు.. ఇంటరాగేషన్ నిమిత్తం ఆఫీస్‌కు తీసుకెళ్లారు.

కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చేసిన తర్వాత తన ఇంట్లో తనిఖీలు జరిగాయని.. ఈ కేసులో సంజనా ఫ్రెండ్, రియల్టర్ రాహుల్ కూడా అరెస్ట్ అయినట్లు తెలిపింది సీసీబీఐ. విరెన్ ఖన్నా ఇంటిపై కూడా రైడ్ చేసిన అధికారులు.. ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, బుజ్జిగాడు సినిమాలో క్యూట్‌గా కనిపించిన సంజన.. తమిళ్ సినిమా ‘ఓరు కాదల్ సెయివీర్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. కాగా తన సోదరి నిక్కీ గర్లాని కూడా హీరోయిన్‌గా రాణిస్తోంది.


Next Story

Most Viewed