- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పామాయిల్ వైన్ నుంచి హ్యాండ్ శానిటైజర్ తయారీ
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ రాకుండా ఉండడానికి నీళ్ల సదుపాయం అందుబాటులో లేనపుడు చేతులకు ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ ఉపయోగించాలన్న సంగతి తెలిసిందే. అయితే మహమ్మారి ప్రభావంతో శానిటైజర్ల స్టాక్ కూడా అయిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోనేషియాలో పామాయిల్ వైన్ నుంచి శానిటైజర్ తయారీని ప్రారంభించారు. బాలీ పోలీస్ చీఫ్ పెట్రస్ రీన్‌హార్డ్ గులోస్‌కి వచ్చిన ఈ ఐడియా ఇప్పుడు అక్కడి వారందరికీ కావాల్సినంత హ్యాండ్ శానిటైజర్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ శానిటైజర్ల తయారీ కోసం స్థానికంగా అరాక్ అని పిలిచే పాపులర్ ఆల్కహాల్‌ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 4000 లీటర్ల అరాక్‌ని చీఫ్ సేకరించారు. తర్వాత ఈ ఆల్కహాల్‌ని బాలిలోని ఉద్యాన యూనివర్సిటీ సిబ్బంది శానిటైజర్లుగా మారుస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 96 శాతం ఆల్కహాల్ ఉండేలా శానిటైజర్ తయారుచేసినట్లు రీన్‌హార్డ్ తెలిపారు. అంతేకాకుండా చేతులకు దురద రాకుండా ఉండటానికి ఇందులో లవంగాలు, పుదీనా నూనెలు కలిపినట్లు చెప్పారు. ఇప్పటివరకు 10600ల బాటిళ్లను తయారుచేసి అవసరమైన వారికి సరఫరా చేశారు. ఇదిలా ఉండగా బాలిలో ఇప్పటివరకు 49 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించగా వారిలో ఇద్దరు చనిపోయారు.
Tags: Hand Sanitizer, Palm oil wine, Akar, Indonesia, corona, covid 19